7 August, 2026 | 2:27 AM

మొరం మట్టి అక్రమ రవాణా..

07-08-2026 01:43 AM

ఎర్రవల్లి, ఆగస్టు 6 (విజయక్రాంతి): కొదండాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా మొరం మట్టి తరలిస్తున్న రెండు టిప్పర్ వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వేముల గ్రామ శివారులో బ్లూ కోల్ట్ పెట్రోలింగ్ సిబ్బంది తనిఖీలు నిర్వహించగా, వాహనాల డ్రైవర్లు ట్రాన్సిట్ పర్మిట్, వే బిల్ తదితర అనుమతి పత్రాలు చూపించలేకపోయారు. దీంతో రెండు టిప్పర్లను స్వాధీనం చేసుకుని సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.