27-10-2025 12:00:00 AM
వాజేడు అక్టోబర్ 26 (విజయ క్రాంతి): ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు బాలుడు మృతి చెందిన సంఘటన వాజేడు మండలంలో పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్త్స్ర గుర్రం కృష్ణ ప్రసాద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
పేరూరు ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బొల్లె యశ్వంత్(13) స్నేహితులతో కలిసి రాంపూర్ గ్రామ పరిధిలో ఉన్నటువంటి బొరియల మడుగులో ఈతకు వెళ్లగా ప్రమాదవశాత్తు లోతులోకి వెళ్లి ఈత రాకపోవడంతో మరణించినట్లుగా ఎస్‌ఐ తెలిపారు. మృతుడి తండ్రి వల్ల భీమేష్ ఫిర్యాదు మేరకు పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.