27-10-2025 02:32:03 PM
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం(Kurnool Bus Fire Accident) సంభవించిన చిన్న టేకూరు సమీపంలో ఒక కంటైనర్ వాహనం ముందుకు వెళ్తున్న కార్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదం చిన్నటేకూరు- చెట్ల మల్లాపూరం మధ్య చోటుచేసుకుంది. సోమవారం జరిగిన ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు, కానీ మూడు కార్లు దెబ్బతిన్నాయి. ప్రమాదం జరిగిన కంటైనర్ ట్రక్కు బెంగళూరు వెైపు వెళ్తోంది. సమాచారం అందుకున్న కర్నూలు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వాహనాలను క్లియర్ చేసి ఆ మార్గంలో ట్రాఫిక్ సజావుగా సాగేలా చూశారు. ప్రమాదానికి కారణమైన కంటైనర్ డ్రైవర్ వివరాలను పోలీసులు సేకరించారు. బస్సు అగ్ని ప్రమాదంలో భారీగా ప్రాణ నష్టం సంభవించగా, ఇతర ప్రయాణీకులు కిటికీ అద్దాలు పగలగొట్టి తప్పించుకున్నారు.