calender_icon.png 27 October, 2025 | 4:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీరాంపూర్ నుంచి శభరిమలకు పాదయాత్ర

27-10-2025 01:49:26 PM

శోభాయాత్రను ప్రారంభించిన ఏబీఏపీ అధ్యక్షుడు లక్ష్మణ్ 

శ్రీరాంపూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కాలనీకి చెందిన అయ్యప్ప భక్తుడు బోడ రామకృష్ణ అయ్యప్ప మాల ధరించి మహా పాదయాత్రగా శభరిమలకు భయలుదేరారు. సోమ వారం శ్రీరాంపూర్ లోని శ్రీ భక్తాంజనేయ ఆలయం నుంచి ప్రారంభించిన యాత్రను అఖిల భారతీయ అయ్యప్ప ధర్మప్రచార సభ(ఏబీఏపీ) శ్రీరాంపూర్ అధ్యక్షుడు బొడ్డు లక్ష్మణ్, రాష్ట్ర మీడియా ఇంచార్జి బాస్కరి రాజేశం, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డిలు ప్రారంభించారు. 

ముందుగ ఆలయంలో వేద పండితులు కొమ్మెర విజయశర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహా పాదయాత్ర చేస్తున్న అయ్యప్ప భక్తుడు రామకృష్ణను శ్రీరాంపూర్ కాలనీ అయ్యప్ప సేవా సన్నిదానం గురుస్వాములు శాలువాలతో ఘనంగా సన్మానించి సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతు 1400 కిలో మీటర్ల దూరంలోని శభరిమలకు పాదయాత్ర చేయనున్నారని చెప్పారు. పంబా నదికి చేరి శభరిమల అయ్యప్ప స్వామిని 45వ రోజు అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో వనమాల సత్యనారాయణ, దాసరి నవీణ్, జక్కెన రమేష్, బోడ రాజేష్, గంగాధర్, కేతిరెడ్డి భరత్ రెడ్డి, కొండి రజినీకాంత్, ఎగ్గడి వినోద్ కుమార్, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.