27-10-2025 03:02:35 PM
హైదరాబాద్: 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ భారతీయ జనతా పార్టీపై తీవ్ర విమర్శాలు చేశారు. బిహార్ లో ఓట్లు తొలగించి లేని ఓట్లను జోడించారని, ఈ దేశంలో ఈవీఎంలు ఉన్నంతవరకు బీజేపీ అధికారంలోనే ఉంటుందన్నారు. ఈసారి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవదని, బీజేపీ గెలిస్తే అనుమానం వస్తుందని ఆర్జేడీని గెలిపిస్తారని ఆయన పేర్కొన్నారు. బ్యాలెట్ విధానంతోనే ఎన్నికలు జరగాలని, బ్యాలెట్ విధానం కోసమే తను పోరాడుతున్నానని కేఏ పాల్ తెలిపారు. 243 మంది సభ్యులు ఉన్న బిహార్ అసెంబ్లీకి నవంబర్ 6, 11వ తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరుగగా, నవంబర్ 11న కౌంటింగ్ జరుగుతోందని ఎన్నికల కమీషన్ వెల్లడించింది.