calender_icon.png 27 October, 2025 | 5:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్

27-10-2025 02:28:17 PM

న్యూఢిల్లీ: ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మొంథా తుఫానుగా మారిందని భారత వాతావరణ శాఖ (IMD) సోమవారం తెలిపింది. దీంతో మొంథా తుఫాను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం వైపు దూసుకుపోతుంది. మొంథా తుఫాన్ ప్రభావంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేసి పరిస్థితిపై ఆరా తీశారు. అవసరమైన సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని,  పీఎంఓ కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు. 

మొంథా తుఫాను దృష్ట్యా ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాల్లో 23 జిల్లాలకు ఇవాళ ఐఎండి రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లను జారీ చేసింది. రెడ్ అలర్ట్ జారీ చేయబడిన జిల్లాలు: ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణ, పశ్చిమ గోదావరి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ కాకినాడ  జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి అనే మూడు జిల్లాలు మినహా, మిగిలిన జిల్లాలకు  భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్‌లను జారీ చేశారు.