calender_icon.png 16 August, 2025 | 3:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరంగల్‌లో దారుణం.. ప్రియురాలి తల్లిదండ్రులను చంపిన లవర్

11-07-2024 11:51:10 AM

చెన్నారావుపేటవరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం 16 చింతల్ తండాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమపెళ్లి చేసుకున్న యువతి కుటుంబసభ్యులపై యువకుడు దాడి చేశాడు. అర్ధరాత్రి దీపిక కుటుంబసభ్యులపై నాగరాజు తల్వార్ తో దాడి చేశాడు. ఈ దాడిలో యువతి తల్లి సుగుణ అక్కడికక్కడే మృతి చెందింది. నర్సంపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువతి తండ్రి శ్రీనివాస్ మృతిచెందాడు. దాడిలో దీపిక, ఆమె సోదరుడు మదన్ కు తీవ్రగాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. నవంబర్ లో గూడూరు మండలం గుండెంగ వాసి నాగరాజు దీపిక ప్రేమపెళ్లి చేసుకున్నారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో పెద్దల సమక్షంలో ఈ జంట విడిపోయింది. ప్రేమించిన యువతిని తనకు దూరం చేశారనే దీపిక కుటుంబంపై పగ పెంచుకున్న నాగరాజు బుధవారం అర్ధరాత్రి నిద్రలో ఉన్న ఆమె కుటుంబసభ్యులపై తల్వార్ తో దాడి చేశాడు. దాడిలో దంపతులు మృతి చెందగా, దీపిక, ఆమె సోదరుడికి గాయాలయ్యాయి. అడ్డువచ్చిన వారిని కత్తితో బెదిరించి నిందితుడు నాగరాజు అక్కడి నుంచి పారిపోయాడు. హత్యకు సహకరించాడని నాగరాజు మిత్రుడు పవన్ పై తండా వాసులు దాడి చేశారు. తండా వాసుల నుంచి పవన్ ను విడిపించిన పోలీసులు స్టేషన్ కు తరలించారు.