calender_icon.png 16 August, 2025 | 4:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెడు వ్యసనాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దు

16-08-2025 02:50:44 PM

బీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బూడిద రాంరెడ్డి..

ఇబ్రహీంపట్నం: చెడు వ్యసనాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దనీ బీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్(BRR Foundation Chairman) బూడిద రాంరెడ్డి అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడ గ్రామంలో బీఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోనీ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు వాలీబాల్, కబడ్డీ, కోకో టోర్నమెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ బూడిద రామిరెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికి తీయడంతో పాటు, చెడు వ్యసనాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ భవిష్యత్తు లక్ష్యాలను చేరుకోవాలని, తద్వారా తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు, పుట్టిన ఊరికి మంచి పేరును తీసుకురావడానికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ బూడిద నరసింహ రెడ్డి, మడుపు గోపాల్, బోసుపల్లి మోహన్, హరిక్రిష్ణ, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.