calender_icon.png 16 August, 2025 | 4:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉగ్రరూపం దాల్చిన కుంటాల వాటర్ ఫాల్స్..

16-08-2025 02:52:44 PM

పర్యాటకుల సందర్శన నిలిపివేత..

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా(Adilabad District) వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో వరద ఉధృతికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లాలోని పలు జలపాతాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇందులో భాగంగానే నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతం(Kuntala Water Falls) ఉగ్రరూపం దాల్చింది. శనివారం భారీగా వరద నీరు జలపాతానికి చేరుకోవడంతో జలపాతం ఉధృతిగా పరవళ్ళు తొక్కుతోంది. దీంతో అధికారులు జలపాతం వద్ద పర్యాటకుల సందర్శనను నిలిపివేశారు.