calender_icon.png 16 August, 2025 | 4:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ జెండాకు అవమానం

16-08-2025 02:55:09 PM

ఇల్లంతకుంట (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District)లో ఇల్లంతకుంట మండలం కేంద్రంలో జాతీయ పతాకం ఆవిష్కరించి 24 గంటలు గడిచిన ఇంకా దించకపోవడంతో అలాగే ఉంది. వివరాల్లోకి వెళ్తే ఇల్లంతకుంట మండల కేంద్రంలోని శ్రీవాణి స్కూల్ లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆగస్టు 16వ తేదీన ఉదయం 8 గంటలకు కూడా ఇంకా జెండాను దించకపోవడంతో ఇదేంటని పౌరులు ఆందోళన చేస్తున్నారు.

శనివారం కూడా కృష్ణాష్టమి సందర్భంగా సెలవు దినం కావడంతో, మమ్మల్ని ఎవరూ ఏమంటారు అని అహంకారంతో ప్రశ్నించిన వారిని సైతం బెదిరించినట్టు విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. జాతీయ జెండాకు అవమానం కల్గించి, కనీసం ఎప్పుడూ దించాలి అనే అవగాహన లేని ఈ ప్రైవేట్ పాఠశాలపై కఠిన చర్యలు తీసుకోని, పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు. ఏది ఏమైనా విద్యాబుద్ధులు నేర్పే పాఠశాలలే ఇలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎలా అంటూ మండల ప్రజలు గుసగుసలు పెడుతున్నారు.