calender_icon.png 16 August, 2025 | 4:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి ,ఉత్పాదకత లక్ష్యాలను సాధించాలి..

16-08-2025 02:46:08 PM

మల్టీ డిపార్ట్ మెంటల్ కమిటీ సమీక్ష సమావేశం..

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): సింగరేణి సంస్థ సి & ఎం.డీ బలరాం(Singareni Company C & M.D. Balram) ఆదేశాల అనుసారం సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాలలో మల్టీడిపార్ట్ మెంటల్ బృందాలు పర్యటించి సమీక్షలు చేస్తున్నాయి. అందులో భాగంగా శనివారం మందమర్రి ఏరియాలోని శాంతిఖనిలో ఏరియ జనరల్ మేనేజర్ జి.దేవేందర్ కమిటీ చైర్మన్, కమిటీ సభ్యులైన విజయ్ ప్రసాద్ (ఎస్.ఓ.టు జి.ఎం), బాలాజీ భగవతి జా (డి.జీ.ఎం ఈ అండ్ ఎం), ఆర్.వి.ఎస్.ఆర్.కే ప్రసాద్ డీ.జీ.ఎం (ఎఫ్ & ఏ),ఎస్. శ్యాంసుందర్ (పర్సనల్ మేనేజర్) కె. కిరణ్ కుమార్, ఎస్.ఇ,(I.E) బృందం పర్యటించింది. మొదటి, రెండవ మూడవ షిఫ్ట్ లలో మల్టీ డిపార్ట్మెంటల్ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో కంపెనీ నిర్దేశించిన ఉత్పత్తి ఉత్పాదకత లక్ష్యాలను సాధించిన విషయాలను, భూగర్భ ఓపెన్ కాస్ట్ గనులలో యంత్రాల వినియోగం సింగరేణిలో అమలు చేస్తున్న సంక్షేమ ఫైనాన్స్ విషయాలను విపులంగా చర్చించారు. 

అదేవిధంగా కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలు, కంపెనీ ముందున్న సవాళ్లను కంపెనీ లక్ష్యాలను సాధించడానికి చేయాల్సిన పనులపై అవగాహన కల్పించారు. గని ఉద్యోగస్తులు కంపెనీకి సూచించిన సలహాలు సూచనలు పాటించడం వల్ల ఉత్పత్తి ఉత్పాదకత పెరుగుతుందని వివరించారు. అందరూ నిబద్ధతతో తమకు కేటాయించిన పనులను చేయడం వలన అనుకున్న లక్ష్యాలను చేరుకుంటామన్నారు. ఉద్యోగులు కార్మికులు పనితనాన్ని మెరుగుపరచుకోవడం వలన లక్ష్య సాధన  సులువు అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో  AITUC బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్, ఎస్.కె  గ్రూప్ ఏజెంట్ అబ్దుల్ ఖాదిర్, శాంతి ఖని గని మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హా, సంక్షేమ అధికారి రవికుమార్, ఉద్యోగులు పాల్గొన్నారు.