calender_icon.png 16 August, 2025 | 4:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు..

16-08-2025 02:58:18 PM

గార్ల/మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) గార్ల మండల కేంద్రంలోని స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కృష్ణుడి ప్రతిమను ఉంచి కనుల పండువగా కృష్ణాష్టమి వేడుకలను భక్తులు ఘనంగా నిర్వహించారు. చిన్నారులను కృష్ణుడు, గోపికల వేషధారణలతో అందంగా అలంకరించారు. కృష్ణుడి ప్రతిమకు ప్రత్యేక పూజలు జరిపి, ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పరచురి కుటుంబరావు, రమేష్, రాజు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.