16-08-2025 02:48:37 PM
గార్ల/మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) గార్ల మండల పరిధిలోని ముల్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిగా వీధులు నిర్వహిస్తున్న డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ ఉత్తమ వైద్యాధికారిగా అవార్డు అందుకున్నారు. 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ వైద్యాధికారిగా ఎంపికై ప్రశంసా పత్రాన్ని జిల్లా ఇంచార్జి కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో(District In-charge Collector Lenin Vatsal Toppo), ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఐపీస్ చేతుల మీదుగా అందుకున్నారు. వైద్య వృత్తిలో అత్యుత్తమ పనితీరు, సేవలు, విజయాలు, విలువలకు అనుగుణంగా ప్రవర్తన, సానుకూల సహకారాలు అందించినందుకు గాను డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ కు ఉత్తమ వైద్యాధికారి అవార్డు లభించడం అభినందనీయమని తోటి వైద్యులు, వైద్య సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.