22 July, 2026 | 1:59 AM

బీపీ ఆచార్య కార్టూన్ల పుస్తకం విడుదల

22-07-2026 12:28 AM

మాజీ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య రచించిన ఆబ్ట్యూస్ యాంగిల్ కార్టూన్ల పుస్తకం నూతన సంచికను మంగళవారం లోక్ భవన్‌లో గవర్న ర్ శివ ప్రతాప్ శుక్ల ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో నాలుగు దశాబ్దాలుగా బీపీ ఆచార్య పరిపాలనా ప్రయాణాన్ని ప్రతిబింబించే కార్టూన్లు ఉన్నాయి. ఈ పుస్తకం పేపర్బ్యాక్ సంచికలో అందుబాటులో ఉన్నది. కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ట్రస్టీ అయిన బీపీ ఆచార్య, ట్రస్టుకు చెందిన ఇతర ట్రస్టీలు ప్రొఫెసర్ పాండురంగరావు, వరంగల్‌కు చెందిన శ్రీధర్‌రావుతో కలిసి ట్రస్ట్ ప్రచురణలను గవర్నర్‌కు అందజేశారు.