16-10-2025 01:04:20 AM
సెక్రటరీ జనరల్ రవికి అభినందించిన మంత్రి
హైదరాబాద్, అక్టోబర్ 15(విజయక్రాంతి): బ్రాహ్మణులను సంఘటితం చేసి అన్ని రంగాల్లోనూ సాధికారత సాధించాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, సమాచార శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అభిప్రాయ పడ్డారు.అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్‌గా నూ తనంగా ఎన్నికైన ద్రోణంరాజు రవి కుమార్ మంత్రి శ్రీధర్‌బాబును మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా రవి కుమా ర్‌ను అభినందించిన మంత్రి ఫెడరేషన్ కార్యకలాపాలను మరింత క్రియా శీలకం చేయాల న్నారు. బ్రాహ్మణులను సంఘటితం చేసి సాధికారత సాధించాలని, అదే సమయంలో సంక్షేమ పథకాల ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించేలా చూడాలని మంత్రి సూచించారు. పదిహేనేళ్ల విరామం తదుపరి తెలుగు రాష్ట్రాలకు చెందిన వారికి జాతీయ సెక్రటరీ జనరల్ పదవి దక్కడం శుభపరిణామమని వ్యాఖ్యానించారు.ఈ కార్యక్రమంలో జంటనగరాల మాజీ అధ్యక్షులు తులసి శ్రీనివాస్ పాల్గొన్నారు.