calender_icon.png 17 October, 2025 | 6:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

1.30 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

16-10-2025 01:05:09 AM

-ఒడిషా నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలింపు

-సంగారెడ్డి జిల్లా కంకల్ టోల్ ప్లాజా వద్ద పట్టుకున్న పోలీసులు

-17,500 నగదు, నాలుగు సెల్‌ఫోన్ రెండు కార్లు స్వాధీనం

మునిపల్లి, అక్టోబర్ 15 (విజయక్రాంతి): అక్రమంగా తరలిస్తున్న రూ.కోటి 30 లక్షల విలువైన గంజాయిని సంగారెడ్డి పోలీసులు పట్టుకున్నారు. ఒడిషా నుంచి మహారాష్ట్రకు అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్లు నమ్మదగిన సమాచారం మేరకు బుధవారం సం గారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశాల మేరకు మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ చేయగా 130 ప్యాకెట్లలో 260 కిలోల గంజాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించి విచారించారు.

ఒడిషా రాష్ట్రం గంజామ్ జిల్లాకు చెందిన రాజ్ కు మార్ గంజాయిని పిటారా పరిచ్ఛా, డేవిడ్ పాల్, ధరంధంద్ పైక్, సంజీవ్‌కుమార్ పరిచ్ఛాలు మహారాష్ట్రలోని మాలెగావ్ ప్రాంతం లో విక్రయిస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్న ట్లు పోలీసులు తెలిపారు. 

 ఎవరైనా గం జాయి లేదా ఇతర మాదక ద్రవ్యాలను సాగు, సరఫరా చేసినా సంగారెడ్డి జిల్లా ఎస్ - న్యాబ్  నెంబర్ 8712656777 కు స మాచారం అందించాలని, సమాచారం అం దించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్పీ పరితోష్ పంకజ్ పేర్కొన్నారు.  ఈ కేసు చేధనలో కీలకంగా వ్య వహరించిన కొండాపూర్ ఇన్‌స్పెక్టర్ సుమ న్ కుమార్, మునిపల్లి ఎస్‌ఐ రాజేష్ నాయ క్, సంగారెడ్డి నార్కోటిక్ అనాలసిస్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వర్ రావు, సిబ్బంది, క్లూస్ టీం సిబ్బందిని ఎస్పీ అభినందించారు.