13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

భళారే బండ్ల ప్రదర్శన

28-03-2026 01:09 AM

పాపన్నపేట,మార్చి27: మండల కేంద్రం పాపన్నపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుట్టపై శ్రీరామనవమిని పురస్కరించుకొని ఎడ్లబండ్ల ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీరామనవమికి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఉదయం సీతారాముల  కళ్యాణం అనంతరం సాయంత్రం గుట్టపై ఎడ్లబండ్ల ప్రదర్శన నిర్వహిస్తారు. గ్రామ ప్రజలే కాకుండా మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు జాతరకు భారీ ఎత్తున తరలివస్తారు. శ్రీరామనవమి మొదటి రోజైన శుక్రవారం ఎడ్లబండ్ల ఊరేగింపు నిర్వహించి శనివారం బోనాలు, ఆదివారం రథోత్సవం కార్యక్రమాలు నిర్వహించనున్నారు.