ఘనంగా శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆవిర్భావ దినోత్సవం
28-03-2026 01:11 AM
నారాయణఖేడ్, మార్చి 27: నారాయణఖేడ్ పట్టణంలోని ప్రసిద్ధి చెందిన శ్రీ సరస్వతి శిశు మంది ర్ ఆవిర్భావ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. దేశ సంస్కృతి, సాంప్రదాయాలను విద్య ద్వారానే భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో శ్రీ సరస్వతి విద్యాపీఠం ఆవిర్భవించిందని, విద్యాపీఠ ఆవిర్భావ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య వక్త శ్రీ చంద్రశేఖర్ ఆచార్య అన్నారు.
ఈ సందర్భంగా చంద్రశేఖర్ ఆచార్య గారు 11,000/- రూపాయలను సేవా నిధిగా పాఠశాలకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల కార్యదర్శి అర్థం చంద్రశేఖర్, సహ కార్యదర్శి శివరాజ్, గోవర్ధన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి పూర్వ విద్యార్థులు, ఆచార్యులు, మాతాజీలు, విద్యార్థి బృందం పాల్గొన్నారు.




