26-01-2026 12:37:28 AM
ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10 వరకు అమలు
ఉమ్మడి జిల్లాకు రూ.కోటి వరకు మంజూరు
సంగారెడ్డి, జనవరి 25(విజయక్రాంతి): ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న ఎస్సెస్సీ విద్యార్థులకు ఈ ఏడాది కేవలం 19 రోజుల మాత్రమే అల్పాహారం అందనుంది. ఈ మే రకు ప్రభుత్వం తాజాగా నిధులు విడుదల చేసింది. గతేడాది 38 రోజులపాటు విద్యార్థులకు అల్పాహారం అందగా ఈ ఏడాది 19 రోజులకు తగ్గించడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెదవి విరుస్తున్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 19 రోజుల అల్పాహారం కోసం సుమారుగా రూ.కోటి రూపాయలు మంజూరు చేయడం జరిగిందని అధికారు లు చెబుతున్నారు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల వ్యాప్తంగా సుమారుగా 15వే లకు పైగా పదవ తరగతి విద్యార్థులు ప్రభు త్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు.
ఉమ్మ డి జిల్లా వ్యాప్తంగా ఎస్సెస్సీ విద్యార్థులు ఉ దయం, సాయంత్రం ఒక గంటపాటు ప్రత్యే క తరగతులకు హాజరవుతున్నారు. సొంతూ రి నుంచి వేరే గ్రామాల్లోని స్కూళ్లకు వెళ్లే వి ద్యార్థులు ఇంటికి వెళ్లే పరిస్థితులు లేవు. ప్రత్యేక తరగతుల కారణంగా ఆలస్యం అవుతుండడంతో ఆకలితో అలమటిస్తున్నారు. అలసట, నీరసం కారణంగా చదువుపై దృష్టి సారించలేకపోతున్నారు.
19 రోజులకే కుదింపు...
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సమగ్ర శిక్ష అభియాన్ పరిధిలోని ఉన్నత పాఠశాలలు (పీ ఎంశ్రీ గురు కుల, కస్తూర్భాలు మినహా) ఉం డగా ఇందులో సుమారు 15వేల మందికి పైగా పదో తరగతి చదువుతున్నారు. మార్చి 16న ప్రారంభం కానున్న వార్షిక పరీక్షల్లో ఉ త్తీర్ణత శాతం పెంపునకు జిల్లా విద్యాశాఖ పరిధిలో ప్రతి రోజూ విద్యార్థులకు ప్రత్యేక తరగ తులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు ప్రతి రోజూ సాయంత్రం ఉడికించిన శనగలు, బి స్కెట్లు, ఇతర అల్పాహారం అందించేందుకు ఒక్కో విద్యార్థికి ప్రతి రోజూ రూ.15 చొప్పున ఖర్చు చేసేలా ఉమ్మడి జిల్లాకు 19 రోజులకు కలిపి రూ.కోటి వరకు మంజూరయ్యాయి.
ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10వ తేదీ వరకు విద్యార్థులకు అల్పాహారం అందించాలని వి ద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. గత సంవత్సరం 38 రోజుల పాటు ఉన్న ఈ పథకం ఈ ఏడాది 19 రోజులకు కుదించడంతో వి ద్యార్థులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారని, కనీసం ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచైనా అల్పాహారం అందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.