26-01-2026 03:02:19 PM
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని వాసవి హై స్కూల్ లో సోమవారం గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి విద్యార్థిని విద్యార్థుల నృత్యాలతో ఆకట్టుకున్నారు. భారతదేశ రాజ్యాంగం భారతదేశపు స్వతంత్ర సమరయోధుల త్యాగాల గురించి చిన్నారులకు వివరించారు. రిపబ్లిక్ డే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాసవి హై స్కూల్ పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మీ శ్వేత, కరస్పాండెంట్ పాలకుర్తి విజయ్, మోటమర్రి సంధ్యారాణి, విద్యార్థిని విద్యార్థులు, టీచర్స్, వాసవి స్కూల్ డైరెక్టర్స్ మోటమర్రి నాగరాజు బచ్చు శివకుమార్ రాఘవేందర్ తాటి రామకృష్ణ, దిగంబర్ మునిగల చంద్రశేఖర్ పాల్గొన్నారు.