26-01-2026 12:36:30 AM
మణికొండ, జనవరి 25 (విజయక్రాంతి) : విద్యారంగంలో 14 ఏళ్లుగా శ్రీ గాయత్రీ ఇ-టెక్నోస్కూల్ అందిస్తున్న సేవలు అభినందనీయమని, దశాబ్ద కాలంగా ఎంతోమంది విద్యార్థులను ఆణిముత్యాలుగా తీర్చిదిద్దడం ప్రశంసనీయమని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఇతర ప్రముఖులు కొనియాడారు. శ్రీ గాయత్రీ ఇ-టెక్నోస్కూల్ 14వ వార్షికోత్సవ వేడుకలు తారామతి బారాదరిలో ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వారు మాట్లాడుతూ ఇక్కడి విద్యార్థులు ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో స్థిరపడటం సంతోషకరమని, భవిష్యత్తులోనూ పాఠశాల ప్రయాణం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ ఉత్సవంలో పాఠశాల చైర్మన్ కొంపల్లి మధుసూధన్, సీఈఓ సర్వేశ్వరరావు, డైరెక్టర్ సమీయుద్దీన్, ప్రిన్సిపాల్ రచన, కాంగ్రెస్ నేత రామకృష్ణారెడ్డి, ఏఎంసీ చైర్మన్లు మల్లేష్, వేణు, నేత అశోక్ యాదవ్, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు సీహెచ్ విఠల్, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.