ఇటిక్యాల రెవెన్యూలో లంచం లొల్లి..
- రూ.2 వేల ఆరోపణలతో రెవెన్యూ కార్యాలయంలో కలకలం
- ఆఫీసులో మామూళ్ల మత్తు..ఉన్నతాధికారులకు రైతు ఫిర్యాదు
- ధరణి ఆపరేట్ప లంచం ఆరోపణలు.. విచారణకు ఆదేశం
- ధరణి ఆపరేటర్‌కు మెమో జారీ
ఇటిక్యాల, జూలై 21: తహసీల్దార్ ఆఫీస్ అంటేనే ఒకప్పుడు కాగితాల వేట. ఇప్పుడు కంప్యూటర్ల బాట. కానీ మారంది మాత్రం ఒకటే... అదే ‘మామూళ్ల’ గీత! ఇటిక్యాల రెవెన్యూ ఆఫీసులో తాజాగా జరిగిన ఒక ఘటన ‘డిజిటల్ విప్లవం’ ముసుగులో జరుగుతున్న క్షేత్రస్థాయి దందాకు అద్దం పడుతోంది.
కేవలం రెండు వేల రూపాయల చుట్టూ తిరిగిన ఈ హైడ్రామా ఇప్పుడు మండలంలో హాట్ టాపిక్ గాక్ మారింది. ఇటిక్యాల తహసీల్దార్ కార్యాలయంలో పొలం రిజిస్ట్రేషన్ వ్యవహారం కాస్తా ‘లంచం’ వివాదానికి దారితీసింది. ఆఫీసులో పని కావాలంటే చేతులు తడపాల్సిందేనంటూ ఓ రైతు చేసిన ఫిర్యాదు.. రెవెన్యూ వర్గాల్లో పెద్ద దుమారాన్నే లేపింది. రూ. 2,000 లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలపై తాసిల్దార్ స్పందించి భూ భారతి ఆపరేటర్ కు మెమో జారీ చేయడంతో మండలంలో చర్చాంశనీయంగా మారింది.
వెంటనే మెమో జారీ చేశాం: తహసీల్దార్ శ్రీకాంత్ రెడ్డి
కార్యాలయానికి వచ్చే రైతులను ఇబ్బంది పెట్టినా, అవినీతి ఆరోపణలు వచ్చినా ఉపేక్షించేదు . లంచం అడిగినట్లు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా భూభారతి ఆపరేటర్ కురుమూర్తికి వివరణ కోరుతూ తక్షణమే మెమో జారీ చేశామని, నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయి.
అదంతా అబద్ధం.. నాపై కక్ష సాధింపు: భూ భారతి ఆపరేటర్ కురుమూర్తి
తాను ఎవరినీ లంచం అడగలేదు . ‘గత కొన్ని రోజులుగా ధరణి పోర్టల్లో సర్వర్ సమస్య తీవ్రంగా ఉంది. దీనివల్ల రిజిస్ట్రేషన్ చేయడం ఆలస్యమైంది. టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల లేట్ అయితే.. నా తప్పు ఉన్నట్లు భావించి, కావాలనే నాపై కక్ష సాధింపు చర్యగా ఈ తప్పుడు ఆరోపణలు మోపారు.






