పాలేరు ఏటీలో బీఆర్‌ఎస్ నేతల ధర్నా
అభివృద్ధి చాటున జరుగుతున్న అక్రమాలపై కమల్ రాజు అండ్ టీమ్ నిరసన
మధిర, జూలై 21(విజయ క్రాంతి): మధిర ఏటి వద్ద జరుగుతున్న రిటర్నింగ్ వాల్ నిర్మాణం వద్ద జరుగుతున్న అక్రమాలను పరిశీలించిన ఖమ్మం మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, బిఆర్‌ఎస్ నాయకులు లింగాల కమల్ రాజు. మంగళవారం రిటర్నింగ్ వాల్ వద్ద జరుగుతున్న పనులు పార్టీ నాయకులు కార్యకర్తలు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ....మేము రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి వ్యతిరేకం కాదని దాన్ని నిర్మించాలని కోరుకుంటున్నామని కానీ గ్రావెల్ అనుమతి తీసుకున్న దగ్గర నుండి గ్రావెల్ తీసుకోవడం లేదని మధిర ఏట్లో అక్రమంగా 20 అడుగుల లోతు తీసి ఆ మట్టిని అక్కడే పోస్తున్నారని అక్రమ సొమ్మును పోగేసుకుంటున్నారని దుయ్యబట్టారు.
అలాగే రాయపట్నం వద్ద ఇసుక అనుమతులు తీసుకొని ఇసుక రీచ్ ని మధిర రైల్వే బ్రిడ్జి వద్ద ఉన్న యేటి వద్ద నుండి తీసుకొని శివాలయం వద్ద రీచ్ పోస్తున్నారని వేటికి అనుమతులు లేకుండా మధిర ఏట్లో ఇసుక తీయడం గ్రావెల్ తీయడం చేస్తున్నారని దీని వలన భూగర్భ జలాలు అడుగంటిపోయి మధిర ప్రజానీకానికి తాగునీరు లేకుండా పోతుందని ఆర్థిక విధ్వంసానికి పాల్పడుతున్నారని దీనిపై పోరాటం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మధిర మున్సిపాలిటీ బిఆర్‌ఎస్ కౌన్సిలర్ వైవిఅప్పారావు బిఆర్‌ఎస్ నాయకులు చిత్తారు నాగేశ్వరరావు, పల్లపోతు వెంకటేశ్వరరావు, అరిగే శ్రీనివాసరావు, పరిస శ్రీనివాసరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.






