17 April, 2026 | 4:53 PM

వంతెన నిర్మాణ పనులు చేపట్టాలి

16-05-2025 12:00 AM

-జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా చైర్మన్ రమేష్

 కుమ్రం భీం ఆసిఫాబాద్ , మే 15(విజయక్రాంతి): కెరమేరి మండలం అనార్ పల్లి, లక్మాపూర్ వాగులపై పెండింగ్ లో ఉన్న వంతెన నిర్మాణ పనులు పూర్తి చేయాలని జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా చైర్మన్ రాథోడ్ రమేష్ సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్ కు గురువారం వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా కరెన్జీవాడ, బోరిలాల్ గూడా, జనకాపూర్, అందుగూడ , గొండ్ గూడ ప్రజలు వర్షాకాలంలో వాగులు ఉప్పొంగడంతో ఇబ్బందులకు గురవుతున్నార ని ఒక్కోసారి ప్రాణాలు పోయే అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్  వివరించడంతో సానుకూలంగా  స్పం దించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమం లో జిల్లా వైస్ చైర్మన్ నైతం మోహన్, జిల్లా జాయింట్ సెక్రెటరీ నైతం భానుచందర్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ చౌరే మహేష్, అసిఫాబాద్ మండల వైస్ చైర్మన్ కొండ శశాంక్ పాల్గొన్నారు.