17 April, 2026 | 3:22 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ధరణి మాయ.. సీలింగ్ శాపం!

16-05-2025 12:00 AM
  1. తరతరాల సాగుభూములకు సంకెళ్లు
  2. రిజిస్ట్రేషన్ కాకుండా బీఆర్‌ఎస్ తాళం
  3. కాంగ్రెస్ సర్కారైనా న్యాయం చేయకపోతే సచ్చిపోతం
  4. భూభారతి సదస్సులో సిద్దిపేట జిల్లా నందారం రైతుల ఆక్రందన

హుస్నాబాద్, మే 15 : సిద్దిపేట జిల్లా అ క్కన్నపేట మండలం నందారం గురువారం నాడు రైతుల ఆగ్రహ జ్వాలలతో రగిలిపోయింది. భూభారతి రెవెన్యూ సదస్సు సాక్షి గా దశాబ్దాల నాటి భూ సమస్య పెనుదుమారం రేపింది. ‘ధరణి‘ తెచ్చిన తంటాలు, సీలింగ్ రూపంలో పడిన శాపం తమ తరతరాల బతుకులను ఛిద్రం చేస్తోందని నందా రం, కపూర్ నాయక్ తండాల రైతులు కన్నీటి పర్యంతమయ్యారు.

వారి ఆక్రందన భూమి పుత్రుల ఆర్తనాదంగా సదస్సు ప్రాంగణాన్ని కుదిపేసింది. ‘ధరణి‘ తెచ్చిన ఉచ్చు, సీలింగ్ రూపంలో పడిన ఉరితాడు తమ బతుకులను బలి తీసుకుంటోందని కపూర్ నాయక్ తండా మాజీ సర్పంచి సంతోష్ నాయక్, నందారం మాజీ సర్పంచి ఎల్లయ్య, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సంజీవ్, ఉపసర్పంచి శ్రీనివాస్ రెడ్డి, రైతులు అజ్మీరా అని ల్, మోతీరామ్, మల్లయ్య తదితరుల ఆధ్వర్యంలో వందలాది మంది రైతులు వచ్చి భూభారతి సదస్సులో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ‘ఊరు పుట్టినప్పటి నుంచి భూము లు దున్నుకొని బతుకుతున్నం.

కేసీఆర్ స ర్కార్ వచ్చిన నుంచి మా భూములన్నీ సీ లింగ్ లో పడేసిండ్రు. పట్టాలు అయితలేవు. విరాసత్ అయితలేదు. పదేండ్లసంది గోసపడుతున్నం‘ అంటూ తండావాసులు తమ దీర్ఘకాలిక వేదనను భూభారతి అధికారుల బృందం ముందు వెల్లగక్కారు. 1456 ఎకరాల విస్తీర్ణంలో 932 ఎకరాలు సీలింగ్లో ఉం డడంతో రైతులు బ్యాంకు రుణాలు పొందలేక, భూములు అమ్ముకోలేక, కొనుగోలు చే యలేక ఆర్థికంగా నలిగిపోతున్నారు. ‘పదేండ్లసంది ఆఫీసర్లు, ఎమ్మెల్యే సుట్టూ తిరిగి యాస్టకొచ్చినం. ఎవలూ పట్టించుకోకపోతే పోయిన పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఓట్లను బహిష్కరించినం.

అప్పుడు ఎమ్మెల్యే, ఆఫీసర్లు వచ్చి భూములు రిజిస్ట్రేషన్ అయ్యే టట్టు చూస్తామని మాట ఇచ్చిండ్రు. అయి నా సమస్య అట్లనే ఉన్నది‘ అంటూ తమ నిస్సహాయతను, గతంలో ఎదురైన మోసా న్ని రైతులు కండ్లకు కట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నీటి మీద రాతలా మారిందని, తమ గోడు వినే నాథుడే కరువయ్యాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. భూ భారతి ఆర్ వో ఆర్ చట్టం అమలులో భా గంగా జరిగిన ఈ సదస్సులో రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో గ్రామానికి పోలీసు బలగాలు వ చ్చాయి. ‘సీలింగ్ ఎత్తివేయాలి..

మా భూము లు మాకు కావాలి‘ అనే నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. బీఆర్‌ఎస్ సర్కార్ ‘ధరణి‘ పేరుతో తెచ్చిన కొత్త రెవె న్యూ విధానం తమకు పట్టాలు లేకుండా చే సిందని, తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములను సైతం సీలింగ్లో చూపించి త మను భూమిలేనివారిగా మార్చిందని రైతు లు ఆవేదన వ్యక్తం చేశారు. పదేండ్లుగా  కా ర్యాలయాల చుట్టూ తిరిగినా, ఎన్నికల సమయంలో హామీలు పొందినా తమ సమస్య మాత్రం పరిష్కారం కాకపోవడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు భూ భారతి ద్వానైనా న్యాయం చేయాలని డి మాండ్ చేశారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ గానీ జిల్లా కలెక్టర్ గానీ వచ్చి సమస్య పరిష్కారానికి స్పష్టమైన హామీ ఇచ్చేదాకా ఇక్క డి నుంచి కదిలేది లేదని భీష్మించారు. ఎవ రూ స్పందించకుంటే భవిష్యత్ ఆందోళన కా ర్యక్రమాలు రూపొందించుకొని అమర నిరాహార దీక్షలు చేపడతామని రైతులు తేల్చి చె ప్పారు. తమ భూములు రిజిస్ట్రేషన్ చేయకపోతే ప్రాణాలైనా అర్పిస్తామని హెచ్చరించా రు.

విషయం తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక విధి నిర్వహణాధికారి (ఓఎస్డీ) శ్రీనివాసరెడ్డికి ఫోన్ చేసి అక్కడికి పంపించారు. ఆయన వచ్చి రైతుల సమస్యను మంత్రి పరిష్కరిస్తారని  చెప్పడంతో రైతులు తమ నిరసనను తాత్కాలికంగా విరమించారు. అనంతరం భూభారతి సదస్సు లో డ్యూటీలో ఉన్న కోహెడ తహసీల్దార్ సురేఖకు రైతులు వినతిపత్రాన్ని ఇచ్చారు.