22 August, 2026 | 2:06 AM

ప్రమాదంలోకాగ్న బ్రిడ్జి

22-08-2026 12:00 AM

ప్రారంభించిన ఐదేళ్లలో రెండవసారి పడిన రంధ్రం

తాండూరు, ఆగస్టు 21, (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ కాగ్న నదిపై నిర్మించిన బ్రిడ్జి పగుళ్లు ఏర్పడి మరోసారి భారీ రంద్రం ఏర్పడింది. గతంలో ఓమారు రంద్రం పడడంతో అధికారులు మూసివేశారు. తాజాగా మరోసారి రంద్రం పడడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురవుతున్నారు. బ్రిడ్జి ప్రారంభించి ఐదు సంవత్సరాలు పూర్తికాకముందే బ్రిడ్జి కి పడడం వెనుక అధికారుల నిర్లక్ష్యం, కమిషన్ల కోసం కక్కుర్తి పడి కాంట్రాక్టర్ నాసిరకం మెటీరియల్ వాడినందుకు పడ్డాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.