ఖైతలాపూర్‌లో వన్ డే వన్ వార్డ్ కార్యక్రమం
కూకట్ పల్లి, ఆగస్టు 21,(విజయక్రాంతి ): కూకట్ పల్లి జోన్ పరిధి కైతలాపూర్ డివిజన్లో వన్డే వన్ డివిజన్ కార్యక్రమాన్ని ఆం జనేయ నగర్ పార్క్ లో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక అ ధికారులతో పాటు సిఎంసి కమిషనర్ సృ జన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్థానికంగా నెలకొన్న సమస్యలపై అభివృద్ధి పనులపై స్థానిక కాలనీల సంక్షేమ సంఘం సభ్యులతో, అసోసియేషన్ సభ్యులతో, స్థానికులతో చర్చించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలపై ఫిర్యాదులు స లహాలు తీసుకున్నారు.
డివిజన్ లో చేపట్టబోయే అభివృద్ధి పనుల గురించి సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు మాట్లాడుతూ మూసాపేట ను ండి ఆంజనేయ నగర్ చౌరస్తా వరకు రోడ్డు విస్తరణ పనుల గురించి, కైతలాపూర్ రోడ్డు విస్తరణ పనులకోసం రూ. 3 కోట్ల 90లక్షలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. మూసాపేట వ సుంధర ఆసుపత్రి నుండి డీమార్ట్ వరకు రూ. 1 కోటి 70 లక్షల రూపాయలతో రోడ్డు అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు తెలిపారు. కైతలాపూర్ లోని జెవెల్ హైట్స్ నుం డి జంగిల్ పార్క్ వరకు రూ. 86 లక్షలతో రోడ్డు అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు తె లిపారు. ఐడియల్ లేక్ నుండి హబీబ్ నగర్ వరకు రోడ్డును అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
డివిజన్లోని పలు కాలనీలలో భూ గర్భ డ్రైనేజీ వ్యవస్థను పటిస్ట పరుస్తున్నట్లు తెలిపారు. పవర్ నగర్ లో స్థానిక ప్రజల అ భ్యర్థన మేరకు మహిళా పార్క్ ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. డివిజన్ పరిధిలోని కా లనీలలో వెలగని వీధి విద్యుత్ దీపాలను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. డివిజన్ పరిధిలోని ప్రగతి నగర్ లో అక్రమంగా పార్కిం గ్ చేస్తున్న ప్రైవేటు బస్సుల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
డివిజన్ లో మౌలిక వసతుల ఏర్పాటుకు చర్యలు తీ సుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. డివిజన్ పరిధిలోని కాలనీవాసులు స్థానికంగా సమస్యలు ఉన్న స్థానిక అధికారుల దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్, కూకట్పల్లి డిసి ఆంజనేయులు, అన్ని విభాగాల అధికారులు, కాలనీల సంక్షేమ సంఘ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






