03-05-2025 06:30:34 PM
ఎమ్మెల్యే కోవ లక్ష్మి....
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): విద్యతో ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవచ్చని ఎమ్మెల్యే కోవా లక్ష్మి(MLA Kova Lakshmi) అన్నారు. శనివారం ఆసిఫాబాద్ మండలం వావుదాం గ్రామంలో 13.5 లక్షల రూపాయల వ్యయంతో గిరిజన పాఠశాల అదనపు గదుల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... గిరిజన ప్రాంతంలో ఆదివాసీలు విద్యపై దృష్టి సాధించాలని సూచించారు. చదువుకోవడంతో అభివృద్ధి చెందవచ్చు అన్నారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 90 మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపింణి చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్ మాజీ ఉపసర్పంచ్ లింభారావు, ఆదివాసి నాయకులు జుగాది రావు, ధర్మారావు, నామ్ దేవ్, కిస్మత్ రావు, ఐటిడిఏ ఏఈ నిజాముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.