03-05-2025 06:26:41 PM
కోదాడ: స్థానిక కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ప్రాంగణ ఎంపికలు జరిగినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి గాంధీ తెలిపారు. విప్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, చెన్నై ఆధ్వర్యంలో జరిగిన ప్రాంగణ ఎంపికలో 23 మంది సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అయిన వారికి వార్షిక వేతనం 2.4 లక్షలు ఉంటుందని కంపెనీ హెచ్ఆర్ సాయిబాబు, గోకులనాథ్, విద్య సాగర్ తెలిపారు. ప్రాంగణ ఎంపికలకు సెలెక్ట్ అయిన విద్యార్థులను కళాశాల చైర్మన్ డాక్టర్ నీలా సత్యనారాయణ అభినందించడం జరిగింది. ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ నాగార్జున రావు సెలెక్ట్ అయిన విద్యార్థులను అభినందించారు. ఈ ప్రాంగణ ఎంపికలకు సెలెక్ట్ కావడానికి కృషి చేసిన ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ ఏజాజ్ మరియు అధ్యాపక మిత్రులను అభినందించడం జరిగింది.