03-05-2025 06:32:55 PM
తాసిల్దార్ కు వినతిపత్రం అందజేసిన యంగ్ స్టార్ యూత్ అధ్యక్షులు షేక్ షకీల్..
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలోని డబుల్ బెడ్ రూమ్ కాలనీలో రేషన్ షాపు ఏర్పాటు చేయాలని ఆ కాలనీ ప్రజలు, యంగ్ స్టార్ యూత్ అధ్యక్షుడు షేక్ షకీల్ ఉపాధ్యక్షుడు అలహస్ కోరారు. ఈ మేరకు శనివారం ఖానాపూర్ తాసిల్దార్ సుజాత రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కాలనీలో ప్రస్తుతం 400 కుటుంబాలు నివాసం ఉంటున్నాయని, ప్రతినెల రేషన్ బియ్యం తీసుకోవడానికి వినియోగదారులు నానా అవస్థలు పడి దూర భారం, ఆర్థిక భారం, మోయాల్సి వస్తుందని, నిరుపేదలైన డబుల్ బెడ్ రూమ్ కాలనీ ప్రజల అవస్థలను దృష్టిలో పెట్టుకుని ప్రతినెలా రేషన్ సరుకులు కాలనీలోనే అందించే ఏర్పాటు చేయాలని కోరగా, తాసిల్దార్ వెంటనే స్పందించి ఈ నెల నుంచి తాత్కాలికంగా సరుకులు అక్కడే అందించే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.