5 June, 2026 | 2:42 AM

ఆర్టీసీ బస్సుల్లో విరిగిన కుర్చీలు

05-06-2026 01:29 AM

నాగర్ కర్నూల్ జూన్ 4 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ ఆర్టీసీ డిపో పరిధిలోని పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులు పూర్తిగా ఫిట్నెస్ కోల్పోయి దర్శనమిస్తున్నాయ్. చాలా దూరం వరకు ప్రయాణించాలనుకున్న ప్రయాణికులకు విరిగిన కుర్చీలు, విరిగిన అద్దాలతో ప్రయాణికులు విసిగి పోతున్నారు.

బస్సు ప్రారంభం నుంచి దిగే సమయం వరకు దడేల్, బిడెల్ అంటూ భారీ శబ్దాలతో చెవిపోటు వచ్చే అవకాశం ఏర్పడిందని ప్రయాణికులు వాపోతున్నారు. కూర్చునే కుర్చీలు కూడా సుచి శుభ్రత పాటించక పోవడంతో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత డ్రస్సు ప్రయాణం నేపద్యంలో బస్సులో సరైన సౌకర్యాలు లేక మహిళలు పెద్దవి వీరస్తున్నారు. నాగర్ కర్నూల్ బస్ డిపోకు చెందిన వనపర్తి నాగర్ కర్నూల్ పల్లెవెలుగు బస్సులో గురువారం ప్రయాణించిన ప్రయాణికుడికి ఎదురైన పరిస్థితి.