31-07-2025 01:07:06 AM
హైదరాబాద్, సిటీ బ్యూరో జూలై 30 (విజయక్రాంతి) : భారత యువ సంచలనం, నగరానికి చెందిన కలగొట్ల వెన్నెల మరోసారి దేశ ప్రతిష్టను అంతర్జాతీయ వేదికపై ఇనుమడింపజేసింది. బ్యాంకాక్‌లో జరిగిన బ్యాడ్మింటన్ ఆసి యా జూనియర్ ఛాంపియన్‌షిప్-2025లో ఆమె అద్భుత ప్రదర్శనతో కాంస్య పతకాన్ని సాధించి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ఈ విజయం హైదరాబాద్ కీర్తి కిరీటంలో మరో మణిపూసగా నిలిచింది. యువ క్రీడాకారిణి వెన్నెల పోరాటం, నైపుణ్యం చూసి పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.
భారత బ్యాడ్మింటన్ ప్రధాన కో పుల్లెల గోపీచంద్ ఆమె ప్రదర్శనపై హర్షం వ్యక్తం చేశారు. “వెన్నెల లాంటి యువ క్రీడాకారులు దేశ భవిష్యత్తుకు ఆశాజనకం గా నిలుస్తున్నారు. ఆమె కృషి, నైపు ణ్యం మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయని ఆశిస్తున్నాను,” అని గోపీచం ద్ పేర్కొన్నారు. వెన్నెల విజయం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఆమె తండ్రి శ్రీనివాసరెడ్డి, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు చాముండేశ్వరినాథ్, అలాగే పుల్లెల గోపీచంద్ తల్లి సుబ్బరావమ్మలను కలిసి అభినందనలు అందుకున్నారు.
ఈ కార్యక్ర మంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ జనరల్ సెక్రెటరీ కానురి వంశీధర్ తదితరులు పాల్గొన్నారు.ఈ విజయం కలగొట్ల వెన్నెలకు భవిష్యత్తులో మరిన్ని గొప్ప విజయాలకు నాంది పలుకుతుందని, ఆమె అంతర్జాతీయ స్థాయిలో భారత పతాకాన్ని మరింత ఎత్తుకు ఎగురవేస్తుం దని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న వెన్నెలకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.