తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై బీఆర్ఎస్ ఆగ్రహం
భీమదేవరపల్లి (విజయక్రాంతి): తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం గతంలో అనేకమంది మేధావులు ప్రొఫెసర్లు విద్యావేత్తలు ఇచ్చిన ఉన్నతమైన విలువలతో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగిందని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మండల సురేందర్ పేర్కొన్నారు. మోసపూరిత ప్రకడంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అన్ని రంగాలలో విఫలమైంది అన్నారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ముల్కనూర్ లో తెలంగాణ తల్లి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జక్కుల అనిత, రమేష్, మాజీ జడ్పిటిసి సభ్యులు వంగ రవీందర్, మాడిశెట్టి కుమారస్వామి, గుడి కందుల పూర్ణ, జక్కుల రాజు, మాడుగుల అశోక్, గుడి కందుల రాజు, కండే చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.






