మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారం
10-12-2024 09:56 PM
భీమదేవరపల్లి (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ మోసపూరిత ప్రకటనలతో అధికారంలోకి వచ్చి ప్రజలను దగా చేస్తున్నదని భీమదేవరపల్లి బిజెపి మండల అధ్యక్షులు పైడిపల్లి పృథ్వీరాజ్ ఆరోపించారు. కొత్తకొండ దేవాలయ భూములు వెంటనే పర్యవేక్షించాలని లేనిపక్షంలో జనవరి 10వ తేదీ నుండి దీక్ష చేపడతామని హెచ్చరించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ 835 కోట్లతో అభివృద్ధి చేశామని తప్పుడు సమాచారం ఇస్తున్నారన్నారు. ఆలయ అధికారులు వెంటనే దేవాలయ భూములు వెలికి తీసి ఆలయ అభివృద్ధికి పాటుపడాలన్నారు. ఈ సమావేశంలో దొంగల కొమురయ్య, శ్రీ రామోజు శ్రీనివాస్, బొజ్జపురి పృథ్వీరాజ్, అయితే సాయి తేజ, పాత పెళ్లి సాయి, జక్కుల అరుణ్ పాల్గొన్నారు.






