బీజేపీ కుట్రలకు బీఆర్‌ఎస్ సహకారం
పీసీసీ ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ కో ఆర్డినేటర్ కత్తివెంకటస్వామి
పార్లమెంట్ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్‌ల నియామకం
హైదరాబాద్, మే3 (విజయక్రాంతి): రాష్ట్రంలో మత విద్వేశాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తోన్న బీజేపీ కుట్రలకు బీఆర్‌ఎస్ సహకరిస్తోందని టీపీసీసీ ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ కో ఆర్డినేటర్ కత్తివెంకటస్వామి అన్నారు. శుక్రవారం ఆయన గాంధీ భవన్‌లో కమిటీ సభ్యులు జి. వినోద్‌రెడ్డి, జనగాం ఉపేందర్‌రెడ్డి తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్టంలోని కాంగ్రె స్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తోన్న బీజేపీ, బీఆర్‌ఎస్ కుట్రలను తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులను కోరారు.
మెజార్టీ స్థానాల్లో విజయం కోసం ఎన్నికల మేనేజ్‌మెంట్ కమి టీ ఆధ్వర్యంలో పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా 50 మంది కో ఆర్డినేటర్లను నియమించినట్లు తెలిపారు. పోలీసులకు, ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీకి ఈ కమిటీ సహరిస్తుందన్నారు. కమిటీ సభ్యుడు వినోద్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలని సీఈవో, డీజీపీలను స్వయంగా కలిసి కోరినట్లు తెలిపారు. ఎంఐఎం, ఎంబీటీ, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు హైదరాబాద్‌లో మత కల్లోలాలు సృష్టించి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నాయన్నారు.
నియోజకవర్గాల వారిగా ఇన్‌చార్జ్‌లు
మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ -అదిలాబాద్, జహీరాబాద్, మెదక్
ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ -పెద్దపల్లి, కరీంనగర్
పీసీసీ ఉపాధ్యక్షులు ఎంఆర్‌జీ వినోద్‌రెడ్డి -నిజామాబాద్, మల్కాజ్‌గిరి, హైదరాబాద్
మాజీ మంత్రి పుష్పలీల -సికింద్రాబాద్, చేవెళ్ల
దివ్యవాణి చౌదరి -మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్
కపిలవాయి దిలీప్‌కుమార్ -నల్లగొండ , భువనగిరి, ఖమ్మం
కత్తి వెంకటస్వామి -వరంగల్, మహబూబాబాద్




