29-10-2024 02:10:57 AM
హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): జన్వాడ ఫాంహౌస్‌పై వాస్తవాలు చూపించినందుకే గతం లో సీఎం రేవంత్‌రెడ్డిని 40 రోజులు జైల్లో పెట్టారని, అక్కడే ఆయన్ను చంపాలని కుట్ర చేశారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ వ్యాఖ్యలు చేశారు.
ప్రతీవారం రాజ్ పాకాల రేవ్ పార్టీ నిర్వహిస్తున్నాడని, పక్కా సమాచారంతోనే పోలీసులు దా డులు చేశారని, త్వరలోనే వాస్తవా లు ప్రజల ముందుపెడుతామని ఆ యన పేర్కొన్నారు. సోమవారం ఆ యన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నార్కోటిక్ టెస్టులకు వెళ్లాలని సూచించారు.
డ్రగ్స్ ఆరోపణలు మాపై ఎందుకు రావ డం లేదు..? మాటి మాటికి కేటీఆర్‌పై డ్రగ్స్ ఆరోపణలు ఎందుకు వ స్తున్నాయని ఆయన ప్రశ్నించారు. జన్వాడ ఫాంహౌస్‌లోని పార్టీలో కేటీఆర్ బావమరిది లిక్కర్, పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుపడ్డారని షబ్బీర్‌అలీ తెలిపారు.