29-10-2024 02:09:45 AM
ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల నిర్వహించింది ఫ్యామిలీ పా ర్టీనా? లేక దీపావళి పార్టీనా..? ఇంకేదైననా అన్నది కొన్ని రోజుల్లోనే ఆ ధారాలతో సహా బయటకొస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఎక్స్ వేదికగా స్పందించారు.
బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ పేరు బయటికి వ చ్చింది కాబట్టే రాజకీయాల్లోకి కు టుంబాన్ని లాగుతున్నారని ఆ పార్టీ నేతలు నెత్తినోరు కొట్టుకుంటున్నారని, కేటీఆర్‌కు మాత్రమే కుటుంబం ఉందా? మా నాయకుడు, సీఎం రేవంత్‌రెడ్డిని నాడు అర్ధరాత్రి బె డ్రూంలోకి వెళ్లి అన్యాయంగా అరెస్ట్ చేసినప్పుడు కుటుంబం, కుటుంబ విలువలు గుర్తుకు రాలేదా? అది కక్షసాధింపు, దిగజారుడు రాజకీయం కాదా? అని ఎమ్మెల్సీ వెంకట్ నిలదీశారు.
ఫోన్ ట్యాపింగ్‌లు చేసి భార్య, భర్తల ప్రైవేట్ విషయాలు విన్న నీతిమాలిన బతుకులు మీవని మండిప డ్డారు. రాజ్‌పాకాల పార్టీలో ఒక వ్యక్తికి డ్రగ్ టెస్టులో పాజిటివ్ వ చ్చిందని, తప్పు జరగడంతోనే పోలీసులు న్యాయబద్ధమైన విచారణ చేస్తున్నారని ఎమ్మెల్సీ తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో ట్రాప్ చేసి రాజకీయం చేశారు కాబట్టే.. తమ ప్రభుత్వం కరెక్ట్ రూట్‌లో ఉన్నప్పటికీ మీకు తప్పుగానే కనిపిస్తుందని ఆయన ఆరోపించారు.