6 June, 2026 | 1:43 AM

ఢిల్లీకి మూటల కోసమే భూముల విలువల పెంపు

06-06-2026 12:18 AM

బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్  వంటేరు ప్రతాప్ రెడ్డి

గజ్వేల్, జూన్ 5:  రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలను భారీగా పెంచడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై అదనపు భారం మోపుతోందని, ఈ నిర్ణయాలు ఢిల్లీకి మూటలు పంపేందుకే తీసుకున్నవని గజ్వేల్ నియోజకవర్గ బీఆ ర్‌ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆరోపించారు.

శుక్రవారం గజ్వేల్లో నిర్వహిం చిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగంతో పాటు ఇతర వ్యాపార రంగాలు తీవ్ర సం క్షోభంలోకి వెళ్లాయన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రాష్ట్రం ఆర్థికంగా బలపడిందని, సంపద సృష్టి, పె ట్టుబడుల ఆకర్షణలో తెలంగాణ దేశంలో నే ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు కేసీఆర్ పాలనలో ఉన్న స్థాయి నుంచి ప్రస్తుతం తగ్గిపోయిందన్నారు.