మున్సిపల్ అజెండాపై బీఆర్‌ఎస్ కౌన్సిలర్ల అభ్యంతరం
01-08-2026 12:00 AM
గద్వాల టౌన్, జూలై 31: గద్వాల మున్సిపాలిటీలో శుక్రవారం నిర్వహించిన సాధారణ మండలి సమావేశంలో బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు పలు అజెండా అంశాలపై తమ అభ్యంతరాలను అధికారికంగా నమోదు చేశారు. సమావేశ అజెండాలోని 3,6,7,9,11,15,18,19,22 అంశాలపై డిసెంట్ వ్యక్తం చేస్తూ చైర్పర్సన్కు ప్రత్యేక లేఖ సమర్పించారు.
సదరు అంశాలను పునఃపరిశీలించి పారదర్శకంగా నిర్ణయం తీసుకోవాలని కోరిన కౌన్సిలర్లు, తమ అభ్యంతరాలను జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం త్వరలోనే కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. మండలి సమావేశంలో బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు డిసెంట్ నమోదు చేయడం ప్రాధాన్యత సంతరించుకోగా ఈ పరిణామం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.






