పట్టాల కోసం 18 ఏళ్లుగా ఎదురు చూపులే..!
01-08-2026 12:00 AM
పెంట్లవెల్లి, జూలై 31: ఇల్లు లేని నిరుపేదల కోసం 2008లో కొనుగోలు చేసిన 14 ఎకరాల 39 కుంటల భూమిని ఇప్పటికీ లబ్ధిదారులకు పంపిణీ చేయకపోవడంతో పేద లు 18 ఏళ్లుగా పట్టాల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రజా సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు పలుమార్లు ఉద్యమాలు చేసినా ఫలితం లేకపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మండల కేంద్రంలో సుమారు 2,500 మంది నిరుపేదలు ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తుండగా, చాలామంది ఇప్పటికీ అద్దె ఇళ్లలోనే జీవనం సాగిస్తున్నారు. వెంటనే భూమి పట్టాలు పంపిణీ చేసి అర్హులైన పేదలకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.






