1 August, 2026 | 1:07 AM

బోనాల నిర్వహణకు చెక్కుల పంపిణీ

01-08-2026 12:00 AM

జూబ్లీహిల్స్, జూలై 31(విజయక్రాంతి): బోరాబండ డివిజన్ పరిధిలో బోనాల పండుగ సందడి మొదలైంది. వివిధ ఆలయాల వద్ద స్థానిక బస్తీ, కాలనీ కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాట్లు ఊపందుకుంటున్నాయి. ఆలయ కమిటీల సభ్యులు కూడా ఉత్సవాల నిర్వహణలో తలమునకలయ్యారు. ఈ క్రమంలో డివిజనులోని వివిధ ఆలయాలకు బోనాల నిర్వహణ కోసం దేవాదాయ, ధర్మాదాయ శాఖ నిధులను మంజూరు చేసింది.

అందుకు సంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు. మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ తో కలిసి ఆలయ కమిటీల సభ్యులకు చెక్కులను అందజేశారు.