ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
27-04-2026 03:24 PM
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): మండల కేంద్రం అర్వపల్లితో పాటు మండలంలోని అన్ని గ్రామాలలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అర్వపల్లిలో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గుండగాని సోమేష్ గౌడ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా 2001లో బీఆర్ఎస్ పురుడు పోసుకుందని, మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో అలుపెరుగని పోరాటంతో స్వరాష్ట్ర స్వప్నాన్ని సకారం చేసిందన్నారు.






