ముదిరాజ్‌లను ఆదుకున్నది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే
మాజీ మంత్రి హరీశ్‌రావు
మెదక్, మే 2 (విజయక్రాంతి) : అన్నివర్గాల ప్రజల అభ్యున్నతికి పాటుపడింది మాజీ సీఎం కేసీఆర్, బీఆర్‌ఎస్ ప్రభుత్వమని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మెదక్ నియోజకవర్గం నిజాంపేట మండ లం చల్మెడ గ్రామానికి చెందిన ముదిరాజ్‌లు గురువారం హరీశ్‌రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్ధానాలతో గద్దెనెక్కిందని, 420 హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ముదిరాజ్‌లకు అన్ని విధాల చేయూతనందించామన్నారు. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కేసీఆర్ వల్లే సాధ్యమైందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ముదిరాజ్ బిడ్డనని చెప్పుకొని ఓట్లు అడగడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ ముదిరాజ్‌లకు ఏం చేసిందో చెప్పి ఓట్లు అడుగాలని డిమాండ్ చేశారు. మెదక్ పార్లమెంట్ బీఆర్‌ఎస్ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, ముదిరాజ్ సంఘం నాయకులు, నిజాంపేట, రామాయంపేట మండల బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.




