calender_icon.png 16 December, 2025 | 1:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక ఎన్నికలలో బీఆర్‌ఎస్

08-12-2025 12:00:00 AM

  1. అభ్యర్థుల గెలుపును ఎవరూ అడ్డుకోలేరు

దాడులతో ఎవరిని భయపెట్టలేరు

మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు

మణుగూరు, డిసెంబర్ 7,(విజయక్రాంతి):మండలంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార పార్టీ ఎన్ని ప్రలోభా లకు గురి చేసిన బీఆర్‌ఎస్ పార్టీ బలపరి చిన అభ్యర్థుల గెలుపు ఖాయమని, ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు,పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు స్పష్టం చేశారు. అభ్యర్థుల ప్రచార వాహనాలఫై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడులతో ఎవరిని భయపెట్టలేరన్నారు. ఆదివారం సమితి సింగారం పంచాయతీలో బీఆర్‌ఎస్‌అభ్యర్థి గుండి గౌరీ ప్రచార వాహనంపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు.

ఎన్నికల నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘిస్తూ, ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికలను అడ్డుకునేలా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు తమ పార్టీ ప్రచారన్ని, అడ్డుకునేందుకు ప్రచార వాహనంపై దాడి చేయడం అత్యంత దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు.

ఈ ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టి దాడికి చేసిన వారిపై చట్టపరమైన చేపట్టాలని, డిమాండ్ చేశారు. అధికార పార్టీ ఎన్ని బెదిరింపులు చేసిన, ప్రజా మద్దతుతో తమ అభ్యర్థి గుండి గౌరీ గెలుపు తద్యమన్నారు. బెదిరింపులు, దాడులతో బీఆర్‌ఎస్ పార్టీ విజయాన్ని అడ్డుకోవడం ఎవరి వల్ల కాదని ఆయన హెచ్చరించారు.