కాంట్రాక్టు మూడు రోజుల్లో ఎలా ఇచ్చారు..?
హైదరాబాద్: ఆర్టీసీ టిక్కెటింగ్ మెషిన్ల కాంట్రాక్టుపై మేం వివరణ ఇవ్వలేము, అది మా పరిధిలో లేదు అంటూ బీఆర్ఎస్ నేత క్రిశాంక్ వేసిన ఆర్టీఐ కు ఆర్టీసీ ఎండీ రిప్లై ఇచ్చారు. టెండర్ లేకుండా కోట్ల రూపాయల కాంట్రాక్టు ఎలా ఇచ్చారు..? రెండు సంవత్సరాల నుంచి రద్దు చేస్తూ వొచ్చిన కాంట్రాక్టు మూడు రోజుల్లో ఎలా ఇచ్చారు..? మూడు రోజుల్లో దేశం మొత్తం ఆర్టీసీ డెలిగేషన్ వెళ్లి స్టడీ చేసిందా? అని క్రిశాంక్ ప్రశ్నించారు. ఏయే రాష్ట్రాలకు వెళ్లారు, ఏ అధికారులను కలిశారు, వాళ్ళు ఎం డీటెయిల్స్ ఇచ్చారు అని ఆర్టీఐ ద్వారా సమాచారం కోరితే ఆర్టీసీ అధికారుల సింపుల్ గా ఆర్టీసీ టిక్కెటింగ్ మెషిన్ల కాంట్రాక్టు పై మేం వివరణ ఇవ్వలేము, అది మా పరిధిలో లేదన్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అధికారులను ఏదైనా సమాచారం అడిగితే మాకు తెలియదు, అది మా పరిధిలో లేదు అంటున్నారు.. మంత్రులను ఏదైనా అడిగితే వాళ్ళు కూడా మాకు తెలియదు అంటూన్నారు మన్నె క్రిశాంక్ ఫైర్ అయ్యారు.






