కాంగ్రెస్‌లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య
28-06-2024 03:30 PM
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ స్వీడ్ అందుకుంది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో యాదయ్య కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తాజాగా కాంగ్రెస్ లో పార్టీలో చేరిన విషయం తెలిసిందే.






