10 June, 2026 | 1:55 AM

హంజీ నాయక్‌కు బీఆర్‌ఎస్ నాయకుల పరామర్శ

10-06-2026 12:56 AM

గరిడేపల్లి, జూన్ 9 : మండల పరిధిలో ఉన్న గారకుంట తండ గ్రామానికి చెందిన గుగులోతు హాంజీ నాయక్ గత కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతూ ఖమ్మంలోని అపెక్స్ హాస్పిటల్ లో చికిత్స పొందిన బాధిత కుటుంబ సభ్యులకు మలిదశ ఉద్యమకారులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గుగులోతు హేమ్లా నాయక్ బిఆర్‌ఎస్ నాయకులతో కలిసి బాధిత కుటుంబ సభ్యులను బ్రెడ్లు పండ్లు అందజేసి  పరామర్శించారు.

ఎటువంటి అ నారోగ్య కారణాలు వచ్చిన వెంటనే డాక్టర్ల ను సంప్రదించి శాస్త్రచికిత్సలు చేయించుకోవాలని ఎండలు విపరీతంగా ఉండటం వలన వడదెబ్బ ఇతర కారణాలవల్ల గ్రామీణ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు మాజీ ఎంపీటీసీ వెంకట్రాo నాయక్ మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు రవీందర్ నాయక్ మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు సందీప్ నాయక్ సామాజిక సేవాకర్త నరేందర్ నాయక్ గ్రామ పెద్దలు పులియ నాయక్ నెహ్రూ నాయక్ పాల రవీందర్ బచ్చలకూరి కోటయ్య కరుణాకర్ నాయక్ వీర్ల నాయక్ శ్రీరంగం బాలు బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు