చైతన్యపురిలో ఓటర్లకు ఎస్‌ఐఆర్ సేవలు అందించిన బీఆర్‌ఎస్ నాయకులు
13-07-2026 12:00 AM
నాగోల్, జూలై 12 (విజయక్రాంతి): చైతన్యపురి డివిజన్లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని పురస్కరించుకుని బీఆర్‌ఎస్ నాయకులు స్థానిక ఓటర్లకు సహాయక కార్యక్రమం నిర్వహించారు. గణేష్పురి, న్యూ ఎంసీహెచ్, మున్సిపల్ కాలనీ ప్రాంతాల ప్రజలకు ఫారాలు నింపడం, అవసరమైన పత్రాలను పరిశీలించడం, దరఖాస్తులను సిద్ధం చేయడం వంటి సేవలు అందించి, వాటిని సంబంధిత బీఎల్వోలకు అందజేశారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఎస్‌ఐఆర్ ప్రక్రియను సులభంగా పూర్తి చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో సాయి ప్రశాంత్, రామకృష్ణ, జలంధర్, పులి కిరణ్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.






