సర్వేల పేరుతో బీఆర్‌ఎస్ తప్పుదోవ
- బీజేపీతో కలవడం తప్ప వేరే మార్గం లేదు
- ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్
హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి): కేటీఆర్‌కి తన పార్టీని పటిష్టం చేసుకోలేక సో షల్ మీడియా, సర్వేల పేరుతో తప్పుదారి ప ట్టించే ప్రయత్నం చేస్తున్నాడని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆరోపించారు. కేసీఆర్ రాసి పెట్టుకో 2035 వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డియేనని, ఆ మాటలకు భ యపడే కేటీఆర్ సర్వేలు పేరు చెబుతున్నాడని విమర్శించారు. ఆదివారం అద్దంకి ద యాకర్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ తో కలవడం తప్ప బీఆర్‌ఎస్‌కి ప్రత్యామ్నా యం లేదన్నారు.
అప్పుడే రాజకీయ భవిష్య త్తు ఉంటుందని, అందుకే బీజేపీతో సీట్ల బేరానికి బీఆర్‌ఎస్ హడావిడి చేస్తోందన్నా రు. ఇక కేసీఆర్ బయటకు వచ్చి రాజకీయాలు చేయరని, ఆయన పేరు చెప్పుకొని పార్టీలో బలపడటానికి పోటీపడుతున్నారని అద్దంకి ఎద్దేవా చేశారు. కేటీఆర్, హరీశ్ మధ్యనే కుర్చీపోటీ ఉందన్నారు. హరీశ్‌కు పార్టీలో ఉంటాడనే నమ్మకం లేదన్నారు.






