calender_icon.png 6 June, 2025 | 10:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు తీవ్ర అస్వస్థత

05-06-2025 05:24:16 PM

హైదరాబాద్: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(62) (Jubilee Hills BRS MLA Maganti Gopinath) గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రి(AIG Hospital)కి తరలించారు. గుండె సంబంధిత సమస్యతో అస్వస్థతకు గురైనట్టు గుర్తించిన ఏఐజీ ఆసుపత్రి వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే మాజీ మంత్రి హరీశ్ రావు(Former Minister Harish Rao), పలువురు బీఆర్ఎస్ నేతలు ఏఐజీ ఆసుపత్రికి చేరుకుని గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.